యాప్నగరం

ఏపీ ఇంటర్ ఫలితాలు: బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు.

TNN 13 Apr 2017, 2:16 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో ఏడాది ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఏడాది కలిపి దాదాపు 10.3 లక్షల మంది రాశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలలో ఎక్కువ ఉత్తీర్ణతను సాధించి కృష్ణా జిల్లానే మొదటిస్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్ లో కృష్ణాలో 77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రెండో స్థానంలో నెల్లూరు (69 శాతం), మూడో స్థానంలో తూ.గో జిల్లా నిలిచాయి.సెకండియర్ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లాలో 86శాతం ఉత్తీర్ణతా నమోదైంది. రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు, మూడో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయి. కడప జిల్లా మాత్రం రెండింటిలోనూ చివరి స్థానంలో నిలిచింది. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.
Samayam Telugu andhra pradesh inter exams 2017 results declared
ఏపీ ఇంటర్ ఫలితాలు: బాలికలదే పై చేయి


ఇంటర్ ఫస్టియర్లో 80 శాతం బాలికలు, 75 శాతం బాలురు ఉత్తీర్ణులవ్వగా, సెకండియర్లో 69 శాతం బాలికలు, 60 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే వారం రోజుల ముందే ఫలితాలను విడుదల చేశారు. ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి... ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.