యాప్నగరం

APPSC: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 'రివైజ్డ్ కీ' విడుదల

APPSC Recruitment 2019 | ఏపీపీఎస్సీ నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో దేహదారుఢ్య పరీక్షలు, వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తారు.

Samayam Telugu 27 Sep 2019, 7:27 pm

ప్రధానాంశాలు:

  • వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రంతోపాటు రివైజ్డ్ ఆన్సర్ కీ అందుబాటులో
  • అభ్యంతరాలకు అక్టోబరు 1 వరకు గడువు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu food
ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జులై 30న నిర్వహించిన ప్రధాన పరీక్ష రివైజ్డ్ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ శుక్రవారం(సెప్టెంబరు 27) విడుదల చేసింది. ప్రశ్నపత్రంతోపాటు ఆన్సర్ 'కీ'ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రధాన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు, ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా రివైజ్డ్ కీని చూసుకోవచ్చు.
Revised Keys:
ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. తాజాగా రివైజ్డ్ కీని విడుదల చేసింది. రివైజ్డ్ కీపై కూడా అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపొచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అక్టోబరు 1న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది.
నిర్ణీత నమూనాలో ఉన్న అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టుద్వారా లేదా నేరుగా మాత్రమే అభ్యర్థులు అభ్యంతరాలను కమిషన్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిశీలించి తుది 'కీ'ని విడుదల చేయనున్నారు. అనంతరం పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు, తదిరత వివరాల కోసం క్లిక్ చేయండి..

Read Also: ఇండియన్ ఆర్మీలో JCO పోస్టులు.. డిగ్రీ అర్హత

Read Also: CISF లో 914 కానిస్టేబుల్ పోస్టులు.. టెన్త్ అర్హత చాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.