యాప్నగరం

APPSC 2018: ఏపీపీఎస్సీ నుంచి నేడు కీలక నోటిఫికేషన్లు

ఎన్నికలకు మరో నాలుగు నెలలే సమయం ఉండటంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోడానికి కీలక ఉద్యోగ ప్రకటనలు వెలువరించనుంది.

Samayam Telugu 21 Dec 2018, 10:51 am
పలు ప్రభుత్వ విభాగాల్లోని పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం ప్రకటనలు జారీచేయనుంది. దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-3, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌-గ్రేడ్‌-1, అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు, సమాచార పౌర సంబంధాల శాఖలోని అసిస్టెంట్ పీఆర్ఓ, సీసీఎల్ విభాగంలో డిప్యూటీ సర్వేయిర్, అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌స్పెక్టర్‌, తదితర ఉద్యోగాలకు ప్రకటనలు జారీకి కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలోని 109 గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వెల్లడికానుంది. ఉద్యోగ ప్రకటనల అంశంపై గురువారం జరిగిన సమావేశంలో సవివరంగా చర్చించారు.
Samayam Telugu apspsc


పంచాయతీ కార్యదర్శుల ఖాళీల వివరాలు వచ్చినందున డిసెంబరు 26 నాటికి దానికి సంబంధించిన ప్రకటన జారీచేసే విషయంపై కూడా సమాలోచనలు సాగిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం నుంచి వచ్చే స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూపు-1లో కలపాలా? వద్దా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా సమాచారం ఇంకా అందలేదని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద కమిషన్‌ తరఫున చేపట్టాల్సిన ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీ ప్రక్రియను మాత్రం డిసెంబరు చివరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఉదయ్ భాస్కర్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.