యాప్నగరం

APSLRB: ఏపీలో పోలీసు ఉద్యోగాలు.. ఈ సారి ఖాళీలు 11 వేల పైమాటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి.. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి...

Samayam Telugu 1 Nov 2019, 3:06 am
ఏపీలోని నిరుద్యోగులు త్వరలో మరో శుభవార్త వినే తరుణం రాబోతుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 11,500 పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో 340 సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) పోస్టులు ఉండగా.. 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.
Samayam Telugu APSLPRB


Read Also: గురుకులాల్లో 3 వేల ఖాళీలు.. త్వరలో ప్రకటనలు!
వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వెలువడనున్న నేపథ్యంలో పోలీసు శాఖలో ఖాళీల వివరాలను పోలీసు నియామక మండలి ప్రభుత్వానికి అందజేసింది.

గతేడాది 3 వేలకు పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ పూర్తి కావడంతో.. మరోసారి ఖాళీల భర్తీపై పోలీసు నియామక మండలి దృష్టి సారించింది.

Read Also: 'JA' పోస్టుల దరఖాస్తు ప్రారంభం.. డిగ్రీ అర్హ


వీక్లీ ఆఫ్‌తో పెరిగిన ఖాళీలు..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని ప్రకటించగా.. అధికారంలోకి రాగానే వీక్లీ ఆఫ్ అమలుకు ఆదేశాలు జారీచేశారు. దీంతో జూన్‌ 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 30 శాతం సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ మేరకు అవవసరమైన ఖాళీల భర్తీకి పోలీసుశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు దశలవారీగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.