యాప్నగరం

AP: ఉన్నత విద్యలో పలు కీలక సంస్కరణలు..!

విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Samayam Telugu 15 Aug 2020, 3:59 pm
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌ సర్కార్‌ విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యారంగాన్ని పరిపుష్టం చేయడంలో భాగంగా ప్రత్యేక ప్రణాళిక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Samayam Telugu ఉన్నత విద్యారంగం


రాష్ట్రంలోని కేంద్ర విద్యాసంస్థల ప్రముఖులు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర విద్యావేత్తలతో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. సీఎం జగన్ సూచనల మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు.

కరోనా సంక్షోభ సంమయంలోనూ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం జగన్ సూచనల ప్రకారం.. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అక్రిడిటేషన్‌ పొందడమే లక్ష్యంగా బోర్డు పని చేస్తుంది. మెంటార్లుగా వ్యవహరిస్తూ న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్‌బీఏతో సహా ఇతర ప్రఖ్యాత సంస్థల గుర్తింపు కోసం బోర్డు సహకారం అందిస్తుంది.

విద్యాసంస్థలకు వనరులు, మౌలిక సదుపాయాలు, అభ్యాసన వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులు, వినూత్న బోధనా విధానాలతో ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం బోర్డు లక్ష్యం. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. దీనిపై త్వరలో మరింత స్పష్టత రానుంది.

Also read: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..!

Also read: ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.