యాప్నగరం

ఏపీలో నిరుద్యోగ భృతి!

ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో యువతకు నిరుద్యోగ భృతి అందజేయాలని చంద్రబాబు అధ్యక్షత టీడీపీ పొలిట్‌బ్యూర్ నిర్ణయించింది.

TNN 27 Feb 2017, 10:59 am
ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో యువతకు నిరుద్యోగ భృతి అందజేయాలని చంద్రబాబు అధ్యక్షత టీడీపీ పొలిట్‌బ్యూర్ నిర్ణయించింది. వారి విద్యార్హతలను బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు చెల్లించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలాగే వీరిని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించుకునేలా విధాన రూపకల్పన చేయాలని సూచించారు.
Samayam Telugu andhrapradesh govt will provide unemployment allowances
ఏపీలో నిరుద్యోగ భృతి!


సీఎం చంద్రబాబు నాయిడు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అమెరికాలోని తెలుగువారిపై దాడులు లాంటి 17 అంశాలు చర్చకు వచ్చాయి. అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలో ఎన్టీఆర్ క్యాంటీన్లతోపాటు వీధిబాలల సంరక్షణకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఎన్నికల హామీలు అమల్లో భాగంగా వీటిపై తక్షణమే కార్యాచరణ చేపట్టనున్నారు.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా నిరుద్యోగ భృతిపై సీఎం నిర్ణయం తీసుకోకపోవడంతో యువత గుర్రుగా ఉన్నారు. అటు ప్రతిపక్షం కూడా దీన్ని అస్త్రంలా వాడుకోవాలని భావిస్తోంది. ఇలాగే కొనసాగితే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని భావించిన ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయనుంది. అలాగే వచ్చే రెండేళ్లలో పేదలకు పది లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.