యాప్నగరం

CM Jagan: పుత్రికోత్సాహంలో సీఎం జగన్‌.. డియర్‌ హర్షా.. గర్వంగా ఉంది.. కూతుర్ని ఉద్దేశించి ఉద్వేగభరిత ట్వీట్.. హర్షా రెడ్డికి అభినందనల వెల్లువ

Harsha Gets MBA Degree from INSEAD: కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పారిస్ (Paris) పర్యటనలో ఉన్న జగన్.. తన కుమార్తె హర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పెద్ద కుమార్తె హర్ష.. పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌ (Insead Business School) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆమె స్నాతకోత్సవ కార్యక్రమంలో జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 3 Jul 2022, 6:25 am
AP CM YS Jagans daughter Harsha Reddy Gets MBA Degree from Insead Business School: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) పుత్రికోత్సాహంతో ఉన్నారు. కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పారిస్ (Paris) పర్యటనలో ఉన్న జగన్.. తన కుమార్తె హర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పెద్ద కుమార్తె హర్ష.. పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌ (Insead Business School) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆమె స్నాతకోత్సవ కార్యక్రమంలో జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు.
Samayam Telugu Jagans daughter Harsha Reddy


ఇందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసిన జగన్.. ‘‘డియర్ హర్షా.. నీ ఎదుగుదలను చూడటం అద్భుతమైన జర్నీ.. దేవుడి దయ నీపై ఉంది. ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్‌లో నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వకారణం. నీకు దేవుడు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నా’’ అని ఉద్వేగభరిత ట్వీట్ చేయడంతో పాటు.. కూతురు హర్షా రెడ్డి (Jagan's daughter Harsha Reddy), భారతి (Y S Bharati)తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

ఇన్సీడ్‌లో చేరడానికి ముందు హర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదివారు. బాల్యం నుంచి చదువుల్లో ముందుండే హర్ష.. అన్ని పరీక్షల్లోనూ డిస్టింక్షన్ సాధించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువు అయిపోగానే ఆమెకు అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె ఉన్నత చదువుల కోసం ప్రపంచంలోని టాప్-5 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా పరిగణించే ఇన్సీడ్‌లో చేరారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.