యాప్నగరం

AP: గురుకుల కాలేజీల్లో ఐఐటీ, నీట్‌ అకాడమీల ఏర్పాటు

విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 4 Jul 2020, 12:00 pm
విద్యను ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కాలేజీల్లో ఐఐటీ, నీట్‌ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
Samayam Telugu ఏపీ ప్రభుత్వం


రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో రూ.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తామని, వీటిల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. ఇటీవల జరిగిన గురుకుల విద్యాలయాల సంస్థ పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Must read: నిరుద్యోగులకు అలర్ట్‌.. apcos.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి.. ఉద్యోగం పొందండి

అలాగే రాష్ట్రంలో నాలుగు విద్యా సంస్థలను అత్యున్నత కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, బోధన, బోధనేతర సిబ్బంది పదోన్నతులు, బదిలీలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిపై త్వరలో పూర్తి స్పష్టత రానుంది.

Must read: రైల్వే శాఖ కీలక నిర్ణయం‌.. ఉద్యోగాల భర్తీకి బ్రేక్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.