యాప్నగరం

AP : ఉచితంగా ఇంటివద్దకే క్యాస్ట్‌, ఇన్‌ కమ్‌ సర్టిఫికెట్లు.. పూర్తి వివరాలివే

Andhra Pradesh : ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఇకపై ఉచితంగా ఇంటివద్దకే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు రానున్నాయి. గతంలో పట్టణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ– సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి వచ్చేది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Dec 2022, 2:59 pm
AP Government : ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఇకపై ఉచితంగా ఇంటివద్దకే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు రానున్నాయి. ఆదాయ (ఇన్‌కం), కుల (క్యాస్ట్‌) ధ్రువీకరణ సర్టిఫికెట్లకు డిమాండ్‌ చాలా ఎక్కువ. విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ మంజూరులో, ఉన్నత చదువుల సీట్ల కేటాయింపుల్లో ఇవే కీలకం. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పొందాలన్నా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. గతంలో పట్టణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ– సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఒక్కొక్క సర్టిఫికెట్‌కు రూ. 40 నుంచి 50 వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది.
Samayam Telugu AP Government


ప్రస్తుతం విప్లవాత్మకంగా తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో.. గ్రామంలో, వార్డుల్లో ఉండే సచివాలయాల్లోనే సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకొంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.. పేదలకు ఈమాత్రం కష్టంకూడా లేకుండా, అసలు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ సూచన మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది.

Telangana Jobs : తెలంగాణ బీసీ సంక్షేమ శాఖలో 2591 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్‌
ఇలా జారీ చేస్తారు:
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోల మొబైల్‌ యాప్‌కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)కి నివేదిక ఇస్తారు.

ఆర్‌ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్‌ అర్హులకు సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్‌లోడ్‌ చేస్తారు. వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్నీ చర్యలు తీసుకుంటోంది.

AP : ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలివేAPOSS 10th Inter Admission 2022- 23 : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్‌ ప్రవేశానికి తత్కాల్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు మచిలీపట్నం జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి రూ.300, ఇంటర్మీడియట్‌కు రూ.400 చొప్పున అపరాధ రుసుము చెల్లించి డిసెంబ‌రు 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 13వ తేదీ వరకు ప్రవేశ ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.