యాప్నగరం

AP Sachivalayam Hall Ticket: ఈ నెల 12 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల హాల్‌ టికెట్లు.. 20 నుంచి పరీక్షలు ప్రారంభం

సచివాలయ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

Samayam Telugu 3 Sep 2020, 12:12 pm
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఈనెల (సెప్టెంబర్‌ 20) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఈనెల 12 నుంచి http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Samayam Telugu ఏపీ ప్రభుత్వం


మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి జరిగే ఈ పరీక్షలు.. ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్‌ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

విభాగం వారీ పరీక్ష తేదీలు:
  • పంచాయత్ సెక్రెటరీ / మహిళా పోలీస్ / వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ / వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 20 ఉదయం
  • పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్- సెప్టెంబర్ 20, 2020 మధ్యాహ్నం
  • వీఆర్ఓ / విలేజ్ సర్వేయర్- సెప్టెంబర్ 21, 2020 ఉదయం
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ / వార్డు ఎమినిటీస్ సెక్రటరీ- సెప్టెంబర్ 21, 2020 మధ్యాహ్నం
  • వార్డు శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ- సెప్టెంబర్ 22, 2020 ఉదయం
  • వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2- సెప్టెంబర్ 22, 2020 మధ్యాహ్నం
  • విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 23, 2020 ఉదయం
  • వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ- సెప్టెంబర్ 23, 2020 మధ్యాహ్నం
  • వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీ- సెప్టెంబర్ 24, 2020 ఉదయం
  • ఏఎన్ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ (గ్రేడ్ 3)- సెప్టెంబర్ 24, 2020 మధ్యాహ్నం
  • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 25, 2020 ఉదయం
  • విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 25, 2020 మధ్యాహ్నం
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్- సెప్టెంబర్ 26, 2020 ఉదయం
  • విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్- సెప్టెంబర్ 26, 2020 మధ్యాహ్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.