యాప్నగరం

AP High court : ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీలు వెల్లడి.. పూర్తి వివరాలివే

AP High Court Hall Ticket 2022 : జనవరి 14 నుంచి హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జనవరి 23న లేదా అంతకుముందు ప్రశ్నపత్రాల సమాధాన ‘కీ’ని అందుబాటులో ఉంచుతారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 17 Dec 2022, 5:13 pm
AP High Court Exam Date 2022 : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీని ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఎ.గిరిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టులో 241 ఉద్యోగాల భర్తీకి 2023 జనవరి 20న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెక్షన్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, డ్రైవర్‌/ ఆఫీసు సబార్డినేట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, ఓవర్‌సీర్‌/ అసిస్టెంట్‌ ఓవర్‌సీర్, టైపిస్ట్, కాపీయిస్టు పోస్టులకు (కామన్‌ టెస్ట్‌) పరీక్ష నిర్వహిస్తారు.
Samayam Telugu AP High Court Exam Date 2022


జనవరి 14 నుంచి హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జనవరి 23న లేదా అంతకుముందు ప్రశ్నపత్రాల సమాధాన ‘కీ’ని అందుబాటులో ఉంచుతారు. ప్రొవిజనల్‌ ఎంపిక జాబితాను ఫిబ్రవరి 13న లేదా అంతకుముందు ప్రకటిస్తారు. టైపిస్టు, కాపీయిస్టు, డ్రైవర్‌ ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారి జాబితాను మార్చి 3న ప్రకటిస్తారు.

Semester System in AP Schools : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూళ్లలో సెమిస్టర్‌ విధానం.. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌ సర్కార్‌Semester System in AP Government Schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ.. 2023-24 విద్యా సంవత్సరం నుంచి రెండు సెమిస్టర్‌లు.. అలాగే పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఈ సెమిస్టర్ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.