యాప్నగరం

AP Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 560 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Anganwadi Jobs : అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 Nov 2022, 4:20 pm
Anganwadi Supervisor posts : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీకానున్నాయి.
Samayam Telugu Anganwadi Supervisor posts


మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో.. బుధవారం విచారణ కొనసాగగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

AP : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశం.. 1010 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. భర్తీ చేసే పోస్టుల వివరాలివే
AP CM YS Jagan green signal for 1010 jobs : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. త్వరలోనే సంక్షేమ అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి వివరాలను అధికారులు సమీక్షలో వివరించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా.. సంక్షేమ హాస్టళ్లకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. నాడు నేడు కార్యక్రమంపై సమగ్ర కార్యాచరణ ఉండాలన్నారు.

సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశించారు. ఇక సంక్షేమ హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిలో భాగంగానే 759 సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అంతే కాకుండా.. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు.. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ -4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలా మొత్తం 1010 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.