యాప్నగరం

AP: ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు‌ వార్నింగ్.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నెంబర్‌కు మెసేజ్‌ చేయాలంటూ సూచన..!

విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రయివేటు ఇంటర్‌ కాలేజీల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Samayam Telugu 18 Aug 2020, 8:01 pm
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న ప్రయివేటు కాలేజీల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. కరోనా కష్టకాలంలో స్టడీ మెటీరియల్స్‌, యూనిఫారాలు కొనుగోలు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీ యాజమాన్యాలను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ హెచ్చరించారు.
Samayam Telugu ఏపీ ఇంటర్‌ బోర్డు


ప్రయివేటు కాలేజీలు ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు లేదా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మొయిల్‌ ద్వారా లేదా వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒత్తిడి చేసే కాలేజీలపై ourbiep@gmail.comకు ఈమెయిల్ ద్వారా, 9393282578 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also read: UPSC CAPF 2020 నోటిఫికేషన్‌ విడుదల.. 209 అసిస్టెంట్ కమాండెంట్‌‌ ఖాళీలు.. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు..!

అలాగే కరోనా కారణంగా కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్‌ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్‌ సమాచారాన్ని బోర్డు వెబ్‌సైట్‌ http://bie.ap.gov.in/లో పొందుపరిచింది.

Also read: ఈనెల 24 నుంచి కానిస్టేబుల్ ఎంపికకు మెడికల్ టెస్టులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.