యాప్నగరం

'పాలిటెక్నిక్' ప్రవేశాలకు నోటిఫికేషన్..!

ఆంధ్రప్రదేశ్‌ 'పాలిసెట్' ప్రవేశ ప్రకటన విడుదలైంది. 'స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ & ట్రైనింగ్' ఈ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా 2018 సంవత్సరానికిగాను ఏపీలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.

TNN 10 Mar 2018, 1:53 pm
ఆంధ్రప్రదేశ్‌ 'పాలిసెట్' ప్రవేశ ప్రకటన విడుదలైంది. 'స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ & ట్రైనింగ్' ఈ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా 2018 సంవత్సరానికిగాను ఏపీలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. కనీసం 35 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎలాంటి వయోపరిమితి లేదు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 19 నుంచి ఏప్రిల్ 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 27న ఉదయం 11 గం. నుంచి 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Samayam Telugu ap polycet 2018
'పాలిటెక్నిక్' ప్రవేశాలకు నోటిఫికేషన్..!



ప్రవేశ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్-60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం 2 గంటలు. అర్హత మార్కులు 36. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మూడేళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.

వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.