యాప్నగరం

AP Academic Calendar 2022-23: ఏపీలో అకడమిక్ క్యాలెండర్ విడుదల.. పరీక్షలు, సెలవుల వివరాలివే

AP Schools: 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకెడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్యా శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Jun 2022, 11:30 am
AP Schools Academic Calendar 2022-23: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జూలై 5 నంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్న (AP Schools reopen) సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకెడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్యా శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.
Samayam Telugu AP Academic Calendar 2022-23


1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. ఇక సెలవుల విషయానికొస్తే ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26వ తేదీని నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి.

పరీక్షలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూలును ప్రకటించారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 1 పరీక్షలు సెప్టెంబరులో, ఫార్మేటివ్‌ 2 అక్టోబరులో, సమ్మేటివ్‌ 1 నవంబరు, డిసెంబరులో, ఫార్మేటివ్‌ 3 పరీక్షలు జనవరిలో, ఫార్మేటివ్‌ 4 పరీక్షలు ఫిబ్రవరిలో, పది ప్రీ ఫైనల్‌ ఫిబ్రవరి 22 నుంచి, సమ్మేటివ్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయని తెలిపారు. జీవో 117లో పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం, దానికి అనుగుణంగా అకెడమిక్‌ క్యాలెండర్లు విడుదల చేయలేదు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.