యాప్నగరం

ఏపీ 10వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు ఇలా..!

AP Tenth Results: ఫార్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చినట్లు సమాచారం. పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మేటివ్ పరీక్షలను నిర్వహించారు.

Samayam Telugu 10 Jul 2021, 4:19 pm
కరోనా వ్యాప్తి కారణంగా ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు సంబంధించి మార్కుల కేటాయింపు విధానాన్ని ప్రభుత్వం నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. వీరికి పదో తరగతి మార్కులకు 30శాతం వెయిటేజీ.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే.
Samayam Telugu ఏపీ ఎస్‌సీసీ ఫలితాలు 2021


అలాగే.. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఫార్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చినట్లు సమాచారం. పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మేటివ్ పరీక్షలను నిర్వహించారు.

AP Inter Results 2021: ఏపీ ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్‌ ఎప్పుడో తెలుసా..?
అయితే ఫార్మెటివ్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు. ఇలానే ఫార్మెటివ్ 2కు సైతం చేస్తారు. ఉదాహరణకు 50 మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్ – 1 పరీక్షలో ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35, ఫార్మెటివ్ – 2 పరీక్షలో 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు.

అయితే ఇంటర్నల్ మార్కుల విధానం అమలులోకి రావడానికి సర్కార్ జీఓ జారీ చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.