యాప్నగరం

హైదరాబాద్ కాలేజీలో ఆపిల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్!

ఆపిల్ తొలిసారిగా భారత్‌లోని ఓ కాలేజీ నుంచి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. అది కూడా హైదరాబాద్‌లోని విద్యాసంస్థ నుంచి కావడం విశేషం.

TNN 5 Nov 2017, 11:51 am
అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఆపిల్ తొలిసారిగా భారత్‌లోని ఓ కాలేజీ నుంచి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోనుంది. అది కూడా హైదరాబాద్‌లోని విద్యాసంస్థ నుంచి కావడం విశేషం. భాగ్యనగరంలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ హెచ్)లో ఆపిల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఐఐఐటీహెచ్ ప్లేస్‌మెంట్స్ హెడ్ దేవీ ప్రసాద్ తెలిపారు. ఎంపికైన వారికి ఆపిల్ సంస్థ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని ఆఫీసుల్లో ఉద్యోగాలు ఆఫర్ చేయనుందని ఆయన చెప్పారు.
Samayam Telugu apple to recruit employees from an indian engineering college this year
హైదరాబాద్ కాలేజీలో ఆపిల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్!


ఐఐఐటీహెచ్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫిలిప్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నాయని దేవీ శ్రీ తెలిపారు. చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆటోమేషన్ తదితర విభాగాల్లో ఎక్కువ డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. కంపెనీలు టెక్నికిల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, పైథాన్ కంప్యూటర్ లాంగ్వేజీలో నైపుణ్యం సాధించిన వారిని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని ఆయన చెప్పారు. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవ్‌లప్‌మెంట్ విభాగాల్లో సంస్థలు ఎక్కువ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని ప్లేస్‌మెంట్స్ హెడ్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.