యాప్నగరం

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ వాయిదా.. కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?

APPSC: గ్రూప్-1 పరీక్షలను వాయిదావేయాలంటూ.. అభ్యర్థుల అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు మరోసారి పరీక్షలను వాయిదా వేసింది. త్వరలోనే తేదీలను ప్రకటించనుంది.

Samayam Telugu 21 Jan 2020, 9:56 am
ఏపీలో ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలనను వాయిదాపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం (జనవరి 20) ఒక ప్రకటన విడుదల చేసింది. వాయిదాపడిన పరీక్షల తేదీలను జనవరి 27న ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. పాలనాపరమైన కారణాల చేత పరీక్షలు వాయిదావేసినట్లు స్పష్టంచేశారు.
Samayam Telugu grp1


NPCIL: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
కారణాలివే..?

➦ వాస్తవానికి గతేడాది డిసెంబరులోనే గ్రూప్-1 పరీక్షలు జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో.. ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే గ్రూప్-1 శిక్షణకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ జనవరి 11న శిక్షణ ప్రారంభించింది. ఈ కారణంగా పరీక్షకు తక్కువ సమయం ఉండటంతో.. మరోసారి పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు.

ఏపీలో 762 మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టులు

➦ గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యేవారిలో.. ఇటీవలే గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో చేరినవారు కూడా ఉన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది కొత్త కావడం.. వాటిలో ఉద్యోగాల్లో చేరిన వారిలో పని ఒత్తిడి కారణంగా గ్రూప్-1 పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. తమకు ఇంకొంత సమయం కావాలని ప్రభుత్వానికి విన్నవించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు.. జీతమెంతో తెలుసా?

➦ అభ్యర్థుల వినతుల నేపథ్యంలో.. అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని, కమిషన్‌ సభ్యులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం వెల్లడించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 20న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.



ముందుగా ప్రకటించిన షెడ్యూలు ఇలా..
షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 12 నుంచి 23 వరకు 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదావేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఫరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి అభ్యర్థుల నుంచి పెద్దఎత్తున వినతులు రావడంతో.. తలొగ్గిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది.

Read More . . .

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.