యాప్నగరం

పక్కా వ్యూహంతో దరఖాస్తు...పక్కపక్కనే నెంబర్లు!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 26 న నిర్వహించే గ్రూప్-2 ప్రాథమిక పరీక్షకు దరఖాస్తు చేసిన కొందరు పక్కా ప్రణాళికతో దరఖాస్తుల్లో అక్రమాలకు తెరతీశారు.

TNN 20 Feb 2017, 10:49 am
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యే కొందరు పక్కా వ్యూహంతో అర్ధరాత్రి దరఖాస్తు చేయడంతో వారి హాల్‌ టిక్కెట్ల నెంబర్లు పక్కపక్కనే వస్తున్నటలు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను అదునుగా తీసుకుని కొంతమంది ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పగటి సమయంలో చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఇద్దరు కలిసి అప్లయ్ చేసినా హాల్‌ టిక్కెట్ల నెంబర్లలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
Samayam Telugu appsc group 2 applications submission in online
పక్కా వ్యూహంతో దరఖాస్తు...పక్కపక్కనే నెంబర్లు!


అదే అర్ధరాత్రి దాటిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే ఈ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇద్దరు కలిసి దరఖాస్తు చేసుకుంటే వారి హాల్‌టిక్కెట్లు పక్కపక్కనే వస్తాయని కొంతమంది ప్రణాళిక ప్రకారం ఇలా చేసినట్లు సమాచారం. దీంతో రాత పరీక్ష సమయంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడే అవకాశముందని ప్రతిభావంతులైన అభ్యర్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని కొంత మంది ఏపీపీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ ఈ వ్యవహారంపై మా దృష్టి సారించింది. పరీక్షా కేంద్రాల నిర్వహణకు మరింత పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సాయి అన్నారు. అంతేగాకుండా విధి నిర్వహణలో పర్యవేక్షకులు విఫలమైతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.