యాప్నగరం

TSLPRB 2018: ఎస్సై, ఏఎస్సై పరీక్షల తేదీ మార్పు..!

పోలీసు ఉద్యోగ భర్తీ పరీక్షలకు సంబంధించి పోలీసు నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సెప్టెంబరు 2న జరగనున్న కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలను సెప్టెంబరు 9కి వాయిదా వేసే ఆలోచనలో ఉంది.

Samayam Telugu 8 Aug 2018, 1:54 pm
పోలీసు ఉద్యోగ భర్తీ పరీక్షలకు సంబంధించి పోలీసు నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సెప్టెంబరు 2న జరగనున్న కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలను సెప్టెంబరు 9కి వాయిదా వేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే అదేరోజు టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్వో) పరీక్ష నిర్వహించనుండటమే కారణం. అంటే ఒకేరోజు రెండు పరీక్షలు జరుగనున్నాయి.
Samayam Telugu Telugu-image


అయితే ఒకేసారి రెండు పరీక్షలు ఉంటే.. తమకు నష్టం వాటిల్లుతుందని ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీరంతా పరీక్షను వాయిదావేయాలని పోలీసు నియామక మండలిని అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు ఆరోజు జరగాల్సిన పోలీసుల నియామక పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉందని పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) వర్గాల ద్వారా తెలిసింది.

షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2న కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. 29 కమ్యూనికేషన్ ఎస్సై పోస్టులకుగాను 13,944 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో 26 ఏఎస్సై పోస్టులకుగాను 7,700 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Related Article: పోలీసు ఉద్యోగాల భర్తీ పరీక్షల షెడ్యూల్ విడుదల

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.