యాప్నగరం

ఈ కోర్సు పూర్తిచేస్తే 100 శాతం ఉద్యోగం పక్కా!

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో నిర్వహించే అప్పెరల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్, శ్రీపెరంబదూర్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ కోర్సులకు నోటిఫికేషన్.

TNN 23 Apr 2017, 7:46 pm
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులకు సువర్ణావకాశం. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్, అప్పెరల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించే వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీని ద్వారా అప్పెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటెయిల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాలం పూర్తయిన తర్వాత 100 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. దీన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
Samayam Telugu atdc and rgniyd vocational programme courses notification
ఈ కోర్సు పూర్తిచేస్తే 100 శాతం ఉద్యోగం పక్కా!


బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్
విభాగాలు: అప్పెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటెయిల్ మేనేజ్‌మెంట్.
కాలపరిమితి: మూడేళ్లు.
ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత లభించే ఉద్యోగాలు: అప్పెరల్ అండ్ రిటెయిల్ ఇండస్ట్రీ, అప్పెరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ విభాగంలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ మేనేజర్, ఇండస్ట్రియల్ ఇంజినీర్స్, మర్చెండైజర్స్, అసిస్టెంట్ మర్చెంటైజర్స్, క్యూఏ మేనేజర్స్. డిజైన్ అండ్ రిటెయిల్ విభాగంలో మర్చెంటైజర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, శాంపిలింగ్ మేనేజర్, డిజైన్ కో-ఆర్డినేటర్, రిటెయిల్ మేనేజర్, అసిస్టెంట్ మర్చెండైజర్, ఫ్యాషన్ కో-ఆర్డినేటర్.

విద్యార్హతలు: ఏదైనా సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్/ స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు The Principal, ATDC, Survey No. 64, Near Cyber Towers, Opp: Birla Soft, Madhapur, Hyderabad, Telangana చిరునామాకు పంపాలి.
ఫీజు: RGNIYD, Sriperumbudur, TamilNadu పేరుతో రూ.200 డీడీని బ్యాంకులో చెల్లించి దరఖాస్తుతోపాటు పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 9
స్క్రీనింగ్ టెస్ట్ తేది: జూన్ 16
కౌన్సెలింగ్ తేదిలు: జూన్ 27 నుంచి జులై 7

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.