యాప్నగరం

బెల్‌లో ఇంజినీరింగ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) వివిధ విభాగాల్లోని టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 13 Apr 2017, 8:13 pm
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) బెంగళూరు, పోర్ట్‌బ్లయర్ యూనిట్‌లో వివిధ విభాగాల్లోని టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కెమికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu bharat electronics limited jobs notification 2017
బెల్‌లో ఇంజినీరింగ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు


ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ: 6
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రానిక్స్.
విద్యార్హతలు: కెమికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్: 7
విద్యార్హతలు: కమర్షియల్ ప్రాక్టీస్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీతోపాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగం, ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
స్టాఫ్ నర్స్: 2
విద్యార్హతలు: పదో తరగతి, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్‌రిలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.

వయసు: 2017 మార్చి 1 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
పరీక్ష విధానం: రాత పరీక్షను 150 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహఆలనే నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్- 1లో జనరల్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు. దీనిలో లాజికల్, ఎనలిటికల్, కాంప్రహెన్షివ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-2లో టెక్నికల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు: బెల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 చలనా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్ 26


నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.