యాప్నగరం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 5 Dec 2016, 6:42 pm
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా స్టెనో, మినిస్టీరియల్ విభాగాల్లోని ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu border security force asi head constable posts notification
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు

అసిస్టెంట్ సబ్-ఇన్సెపెక్టర్: 36
విద్యార్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. ట్రాన్స్‌స్క్రిప్షన్‌ ఇంగ్లిష్ / హిందీ 50/ 65 నిమిషాల్లో పూర్తి చేయాలి.
హెడ్ కానిస్టేబుల్: 121
విద్యార్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాల వేగం లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 165 సెం.మీ. ఉండాలి. చాతీ 81 నుంచి 86 సెం.మీ ఉండాలి. మహిళల ఎత్తు 155 సెం.మీ. ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసిన సంబంధిత బీఎస్‌ఎఫ్ ఐజీ కార్యాలయానికి పంపాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు The lnspector General, Ftr HO BSF Bangalore, PO-Yelahanka, Bangalore,Karnataka - 560064 పేరుతో పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 2

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.