యాప్నగరం

బీఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 11 Mar 2017, 5:05 pm
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వర్క్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu bsf assistant commandant posts notification
బీఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు


అసిస్టెంట్ కమాండెంట్: 15
విభాగాలు: వర్క్స్, ఎలక్ట్రికల్.
విద్యార్హతలు: సివిల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల సాధారణ ఎత్తు 165 సెం.మీ., చాతీ పరిమాణం 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి. కనీస బరువు 50 కిలోలు ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 రెండు విభాగాల వారీకి ఒకేలా ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 25, జనరల్ అవేర్‌నెట్ 25, రీజనింగ్ 25, న్యుమరికల్ ఎబిలిటీ 25 మార్కులు. పేపర్-2లో అభ్యర్థులు ఎంపికచేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి వ్యాసరూపంలోనే సమాధానం ఇవ్వాలి.

ఇందులో సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో మెరిట్, రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ‌కు ఆహ్వానిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారి మెరిట్ జాబితా ప్రకటించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు: బోర్డన్ సెక్యూరిటీ ఫోర్స్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా The Deputy Inspector General, STC BSF Bangalore, Yelahanka. Bangalore (Kamataka) - 560064 పేరుతో పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 5

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.