యాప్నగరం

CAT ఫలితాల్లో టాపర్లంతా ఇంజనీర్లే

క్యాట్ 2016 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది 20 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు.

TNN 9 Jan 2017, 4:32 pm
ప్రతిష్టాత్మక ఐఐఎంలతోపాటు, దేశంలోని ఇతర బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు అర్హత పరీక్ష అయిన క్యాట్ 2016 పరీక్ష ఫలితాలను బెంగళూరు ఐఐఎం వెల్లడించింది. ఈ ఏడాది 20 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిందరూ పురుష అభ్యర్థులు కావడంతోపాటు ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే కావడం విశేషం. 2015 క్యాట్ ఎగ్జామినేషన్‌లో 18 మంది 100 పర్సంటైల్ సాధించగా.. 17 మంది ఇంజనీర్లు కావడం గమనార్హం. వీరిలోనూ ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారు.
Samayam Telugu cat 2016 results 20 scores 100 percentile
CAT ఫలితాల్లో టాపర్లంతా ఇంజనీర్లే


ఈ ఏడాది క్యాట్‌లో టాపర్లుగా నిలిచిన 20 మందిలో కోల్‌కతాకు చెందిన అవిడిప్తో చక్రబర్తి, పుణఏకు చెందిన యష్ చౌధరీ ఉన్నారు. చక్రబర్తికి వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్‌లో 96.27 శాతం మార్కులు రావడం విశేషం. అతడు డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో 68.16 శాతం సాధించాడు. చక్రబర్తి బిట్స్ పిలానీ నుంచి బీటెక్ చదివాడు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేస్తానని చెప్పిన చక్రబర్తి క్యాట్ రాయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

పుణేలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న యష్ చౌధరీ కూడా 100 పర్సంటైల్ సాధించగా.. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్‌లో అతడికి 86.15 శాతం స్కోరు వచ్చింది. ఈ ఏడాది క్యాట్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ వెర్బల్ రీజనింగ్ నుంచి 34 ప్రశ్నలు రాగా, డేటా ఇంటర్ ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ నుంచి 32 ప్రశ్నలొచ్చాయి. డిసెంబర్ 4న పరీక్ష నిర్వహించగా, దేశవ్యాప్తంగా 138 నగరాల్లో 1.95 లక్షల మంది క్యాట్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సోమవారం ఐఐఎం బెంగళూరు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.