యాప్నగరం

సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల వెల్లడి

సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. శనివారం మధ్యాహ్నం ఈ ఫలితాలను వెల్లడించింది.

TNN 3 Jun 2017, 1:51 pm
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. శనివారం మధ్యాహ్నం ఈ ఫలితాలను వెల్లడించింది. మార్చి - ఏప్రిల్ నెలల్లో పదో తరగతి పరీక్షలు పూర్తవగా.. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదల అవుతాయా అని విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే 12వ తరగతి ఫలితాలు వెల్లడికాగా.. ప్రస్తుతం టెన్త్ రిజల్ట్స్ వెల్లడయ్యాయి. ముందుగా అలహాబాద్, చెన్నై, ఢిల్లీ, త్రివేండ్రం, డెహ్రాడూన్ రీజియన్ల ఫలితాలను ప్రకటించారు. గ్రేడ్ విధానంలో సీబీఎస్‌ఈ ఫలితాలను వెల్లడించింది. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి ఉండొద్దనే ఉద్దేశంతో ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో వెల్లడిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. 2016లో 96.21 శాతం మంది పదో తరగతి ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 96.21 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
Samayam Telugu cbse 10th class results announced
సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల వెల్లడి


cbseresults.nic.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. Bing లోకి వెళ్లి 'CBSE 10th result 2017' అని టైప్ చేసి ఫలితాలు పొందొచ్చు. 'cbse 10 (హాల్ టికెట్ నంబర్)' అని టైప్ చేసి.. 52001 (MTNL), 57766 (BSNL), 5800002 (Aircel), 55456068 (Idea), 54321, 51234 and 5333300 (Tata Teleservices), 54321202 (Airtel), and 9212357123 (National Informatics Centre) ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.