యాప్నగరం

ఆ రెండు పరీక్షలను మళ్లీ నిర్వహిస్తాం: సీబీఎస్‌ఈ

ఇటీవల సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్‌‌‌, పదో తరగతి గణిత పరీక్షల పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. అయితే ఈ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (మార్చి 28) ప్రకటన విడుదల చేసింది.

TNN 28 Mar 2018, 5:09 pm
ఇటీవల సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్‌‌‌, పదో తరగతి గణిత పరీక్షల పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. అయితే ఈ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (మార్చి 28) ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని లీకైన పేపర్ల పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను వారంరోజుల్లో సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు తెలిపింది.
Samayam Telugu CBSE1


వాట్సాప్ ద్వారా మ్యాథమెటిక్స్ పేపర్ లీకవడం, మ్యాథమెటిక్స్ పేపర్ లీకైందన్న... ప్రచారం రావడంతో... స్పందించిన సీబీఎస్‌ఈ ఆ వార్తలను కొట్టి పారేసింది. అన్ని పత్రాలు సీల్‌ వేసిన కవర్లలోనే జాగ్రత్తగా పరీక్షా కేంద్రాలకు పంపించామని.. ఎక్కడా పేపర్‌ లీక్‌ కాలేదని తెలిపింది. తాజా పరిణామాలతో... ఆ రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు... కొంత మంది టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు మళ్లీ పరీక్షల నిర్వహణకు, లీకేజీకి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు... దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు. పదోతరగతి సోషల్ స్డడీస్, 12వ తరగతి బయాలజీ పేపర్లు కూడా లీకయ్యాయని... వారు అంటున్నారు.

ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరీక్ష పేపర్లు బయటకు వచ్చాయన్నా... వార్తల నేపథ్యంలో... పరీక్షలను దేశమంతా నిర్వహిస్తారా లేదా... కేవలం ఢిల్లీ పరిధిలోనే నిర్వహిస్తారా... అన్నది సీబీఎస్ఈ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇలా సీబీఎస్ఈ పరీక్షల పేపర్లు లీకవ్వడం ఇది మొదటిసారేమీ కాదు... గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. 2006లో 12వ తరగతి బిజినెస్ స్టడీస్ పేపర్‌, 2011లో సైన్స్, మ్యాథమెటిక్స్ పేపర్లు లీకయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.