యాప్నగరం

CTET Exam 2019: సీటెట్(జులై) దరఖాస్తు గడువు పెంపు

జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.700 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.350; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.

Samayam Telugu 7 Mar 2019, 7:49 pm

ప్రధానాంశాలు:

  • మార్చి 12 వరకు గడువు పొడిగింపు
  • ఫీజు చెల్లించడానికి చివరితేది మార్చి 13
  • జులై 7న సీటెట్ పరీక్ష నిర్వహణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ctet
న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎసీఈ) కెవీఎస్, ఎన్‌వీఎస్, సెంట్రల్ టిబెటన్ పాఠశాలల్లో టీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జులై)-2019'కు సంబంధించిన దరఖాస్తు గడువును మార్చి 12 వరకు పొడిగించారు. వాస్తవానికి మార్చి 5తో గడువు ముగియగా.. వారంపాటు గడువు పొడిగించారు. ఫీజు చెల్లింపు గడువును కూడా మార్చి 8 నుంచి 15 వరకు పెంచారు. అభ్యర్థులకు మార్చి 14 నుంచి 20 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఏనిమిదో తరగతి పాఠ్యాంశాలను బోధించడానికి టీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాల్లో చేరవచ్చు.
✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై -2019

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.700 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.350; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ):
మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: మార్చి 12

అప్లికేషన్ ఫీజు చెల్లిండానికి చివరితేదీ: మార్చి 13 (మధ్యాహ్నం 3.30 గం॥ వరకు).

దరఖాస్తు ఎడిట్‌కు అవకాశం: 14.03.2019 - 20.03.2019.

పరీక్షతేదీ: జులై 7 (పేపర్-2 -ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 -మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు)

Notification

Website: www.ctet.nic.in

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.