యాప్నగరం

ఇకపై 100 రోజులే పాఠశాలలు..కేంద్రం ఆలోచన..!

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ వ్యవస్థల పనితీరులో మార్పులు అనివార్యమయ్యాయి. అందులో భాగంగా విద్యా వ్యవస్థలో కూడా అనేక మార్పులు రాబోతున్నాయి.

Samayam Telugu 29 May 2020, 7:27 pm
కరోనా వైరస్‌ ఎక్కువగా పిల్లలు, వృద్ధులకు వ్యాపిస్తుందన్న డాక్టర్లు, నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థ నిర్వహణకు సరికొత్త వ్యూహ రచనలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో మాదిరిగా స్కూల్స్‌కు 220 పనిదినాలు అంటే 1,320 గంటల తరగతి బోధన ఇక మీదట ఉండకపోవచ్చనే భావన విద్యావేత్తల్లో వినపడుతోంది.
Samayam Telugu విద్యా వ్యవస్థ


దీనికి ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరం (2020-21)లో స్కూళ్లకు 100 రోజుల పనిదినాలు అంటే 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

విద్యార్థికి ఇంట్లోనే ఆన్‌లైన్‌ బోధనతో 100 రోజులు, 600 అభ్యాస గంటల విద్యా ప్రణాళికను ప్రభుత్వం వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. అయితే మరో 20 రోజులు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంచే విధంగా డాక్టర్లు, కౌన్సెలర్లతో విద్యార్థులకు ప్రేరణ కలిగించే కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ సౌకర్యాలు లేని విద్యార్థులపై స్కూల్‌ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ సూచించింది. భవిష్యత్తులో కూడా ఆన్‌లైన్‌ విధానం తప్పదు కాబట్టి ఆన్‌లైన్‌ సౌకర్యాల కల్పన దిశగా ప్రయత్నం చేయాలని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.