యాప్నగరం

'ఒకటి' నుంచి 'ఇంటర్' దాకా ఒకేచోట...?

విద్యార్థులు ఇక నుంచి ఒకటి నుంచి ఇంటర్ దాకా... ఒకేచోట చదివే అవకాశం రాబోతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

TNN 22 Feb 2018, 12:19 pm
విద్యార్థులు ఇక నుంచి ఒకటి నుంచి ఇంటర్ దాకా... ఒకేచోట చదివే అవకాశం రాబోతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు... డ్రాప్ అవుట్స్‌ను తగ్గించే ఉద్దేశంతో 'సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) విద్యాలయాల' ఏర్పాటుకు కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా... ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా విద్యను అందిస్తున్నాయి. ఈ సమయంలో విద్యాసంస్థలు మారే క్రమంలో విద్యార్థుల డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్‌ పథకం కింద ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట ఏర్పాటుచేస్తే బాగుంటుందని... కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ భావిస్తోంది.
Samayam Telugu central hrd department planning for integrated school education
'ఒకటి' నుంచి 'ఇంటర్' దాకా ఒకేచోట...?


కేంద్ర పథకాలైన 'సర్వశిక్షా అభియాన్‌', 'రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌'లను విలీనం చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులు ఇంటర్‌ వరకు... ఒకేచోట విద్యనభ్యసించేలా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకేచోట చదువుకునే అవకాశం ఉండటం వల్ల విద్యార్థులు ఒకే రకమైన పరిస్థితులకు అలవాటు పడతారు. డ్రాప్అవుట్స్‌ కూడా తగ్గుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.