యాప్నగరం

వచ్చే ఏడాది మారనున్న 'డిగ్రీ' సిలబస్!

యూజీసీ నుంచి మోడల్‌ పాఠ్య ప్రణాళిక వచ్చిన తర్వాతే తాము కమిటీలను నియమించుకొని సిలబస్‌ మారుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

Samayam Telugu 23 Dec 2018, 12:01 pm
బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన సిలబస్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి మారనుంది. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఉండేలా చూడాలని, అందుకు పరిశ్రమలతో అనుసంధానమై విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలని కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా ఉపకులపతుల సమావేశం ఏర్పాటు చేసిన యూజీసీ తేల్చిచెప్పింది. అందుకు అనుగుణంగా సిలబస్‌ మారాలని.. దానిపై మోడల్‌ సిలబస్ తయారుచేసి పంపిస్తామని, రాష్ట్రాలు కొద్దిపాటి స్థానిక మార్పులతో వీటిని అనుసరించాలని యూజీసీ సూచించింది. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు కొత్త సిలబస్‌ అందుబాటులోకి వస్తుంది.
Samayam Telugu graduates


అయితే యూజీసీ నుంచి మోడల్‌ పాఠ్య ప్రణాళిక వచ్చిన తర్వాతే తాము కమిటీలను నియమించుకొని సిలబస్‌ మారుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలోనే డిగ్రీ సిలబస్‌ మారింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్, కామర్స్ తదితర సబ్జెక్టులను మార్చాలని భావించినప్పటికీ.. ఒక బ్యాచ్‌ పూర్తికాకుండా ఎలా మారుస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనికితోడు యూజీసీ సైతం తాము సిలబస్‌లో మార్పులు చేయబోతున్నామని ప్రకటించడంతో రాష్ట్రంలో కొత్త పాఠ్య ప్రణాళిక అమలును నిలిపివేయాల్సి వచ్చింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.