యాప్నగరం

AP: ఈనెల 8న జగనన్న విద్యాకానుక ప్రారంభం

జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

Samayam Telugu 5 Oct 2020, 10:16 am
ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 5న ప్రారంభం కావల్సి ఉన్న జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రెండు రోజుల క్రితం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Samayam Telugu వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి


కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో.. కిట్ల పంపిణీ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రులను బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రధానోపాద్యాయుల సంఘం, వైఎస్‌ఆర్‌ ఉపాధ్యాయ సమాఖ్య కోరాయి. అయితే.. విద్యా కానుక వాయిదా వేసినా పాఠ్య పుస్తకాలను మాత్రం విద్యార్థులకు అందించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కోరింది. అయితే తాజా సమాచారం ప్రకారం విద్యా కానుక పథకాన్ని ఈనెల 8న ప్రారంభించనున్నారు.

Must read: 8 వేల టీచర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల.. దరఖాస్తు చేసుకోండి..!

ఈ విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 43 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫామ్‌, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, స్కూల్‌ బ్యాగ్‌ అందించనున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా మూతబడిన బడులను నవంబర్‌ 2 నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Also read: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 109 జాబ్స్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.