యాప్నగరం

కోచింగ్ సెంటర్లపై సివిల్స్ టాపర్ ఆగ్రహం!

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను కోచింగ్ సెంటర్లు మాయమాటలతో మోసం చేస్తున్నాయని సివిల్ సర్వీసెస్‌లో మూడో ర్యాంకు సాధించిన తెలుగు తేజం రోణంకి గోపాలకృష్ణ ఆగ్రహం.

TNN 8 Jun 2017, 4:15 pm
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో మూడో ర్యాంకు సాధించిన తెలుగుతేజం రోణంకి గోపాలకృష్ణ కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై మండిపడ్డారు. తాను ఎక్కడా శిక్షణ తీసుకోకపోయిన కొన్ని కోచింగ్ సెంటర్లు తన పేరును వాడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాదులోని పలు కోచింగ్ సెంటర్లు తన పేరు, ర్యాంకుతో ప్రకటనలు ఇస్తున్నాయని అసహనం వ్యక్తం చేసిన గోపాలకృష్ణ ఇది చాలా దారుణమని వాపోయారు. పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ కేంద్రాలు చెప్పే మాయమాటలను విని ఎవరూ మోసపోవద్దని ఆయన సూచించారు.
Samayam Telugu civils topper ronanki gopalakrishna anger to coach centres
కోచింగ్ సెంటర్లపై సివిల్స్ టాపర్ ఆగ్రహం!


తన పేరుతో కోచింగ్ సెంటర్లు ఇస్తున్నవన్నీ భోగస్ ప్రకటనలే అని వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యాన్ని తాను సొంతంగానే చదివానని, జనరల్ స్టడీస్‌కు మాత్రం బాల లతగారి వద్ద శిక్షణ పొందానని తెలిపారు. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత ప్రిపరేషన్ కు ప్రాధాన్యత ఇస్తేనే మంచిదని, అలా కుదరకపోతే కోచింగ్‌ తీసుకోవాలని సలహా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.