యాప్నగరం

20 వేల పోస్టులకు భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఆనందం కలిగించే విషయం. వివిధ విభాగాల్లోని 20 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

TNN 30 May 2017, 4:36 pm
గత మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోన్న తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమ‌తినిచ్చారు. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసి నియామ‌కాలు చేపట్టాలని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణికి కేసీఆర్ సూచించారు. 84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1428 పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లోని 29 గురుకులాల్లో 377 టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్, రాష్ట్రంలోని వివిధ పాఠ‌శాల‌ల్లో 8792 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ ప్ర‌భుత్వం భర్తీ చేయ‌నుంది.
Samayam Telugu cm kcr orders to tspsc immediatly issue jobs notifications
20 వేల పోస్టులకు భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!!


వీటితోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరగా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించింది. వీటికి సంబంధించిన రాత పరీక్షలను త్వరలో నిర్వహించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.