యాప్నగరం

కోల్ ఇండియాలో ఉద్యోగాలు

కోల్ ఇండియా జూనియర్ స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 16 Dec 2016, 4:54 pm
కోల్ ఇండియా జూనియర్ స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో హిందీ లేదా ఇంగ్లిష్ స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu coal india limited grade c posts notification 2016
కోల్ ఇండియాలో ఉద్యోగాలు


జూనియర్ స్టెనోగ్రాఫర్: 29
విభాగాలు: హిందీ (రాజభాష, ఇంగ్లిష్)
విద్యార్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. హిందీ లేదా ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. టైప్‌రైటింగ్ హిందీలో నిమిషానికి 30 లేదా ఇంగ్లిష్ నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.

ఎలక్ట్రీషియన్ ట్రెయినీ: 13
విద్యార్హతలు: పదో తరగతితోపాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. అప్రెంటీస్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.

హెవీ మోటార్ మెకానిక్ ఆపరేటర్: 159
విద్యార్హతలు: పదో తరగతితోపాటు ఫిట్టర్/ డీజిల్/ మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. అప్రెంటీస్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి The General Manager (P/MP&R), Room No. 15, Personnel Department, NCL HQ, Singrauli, MP - 486889 పేరుతో పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తు రుసుం: Northern CoalFields Limited,Singrauli పేరుతో ఎస్బీఐ‌లో రూ.500 డీడీని తీసి దరఖాస్తుతోపాటు పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 7

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.