యాప్నగరం

ఇండియన్ రైల్వేలో 745 ఉద్యోగాలు

ఇండియన్ రైల్వేకు చెందిన ఢిల్లీ మెట్రో‌రైల్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లోని నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 7 Nov 2016, 5:39 pm
ఇండియన్ రైల్వేకు చెందిన ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా గ్రేటర్ నొయిడా మెట్రోలోని ట్రెయిన్ ఆపరేటర్, జూనియర్ ఇంజినీర్, కస్టర్ రిలేషన్స్ అసిస్టెంట్, మెయింటనర్ విభాగాల్లో 745 పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu delhi metro rail corporation ltd non executive jobs notification 2016
ఇండియన్ రైల్వేలో 745 ఉద్యోగాలు

ట్రెయిన్ ఆపరేటర్: 194
విద్యార్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ డిగ్రీ ఉండాలి.
కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్: 65
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు మాసాల సర్టిఫికెట్ కోర్సు చేసుండాలి.
జూనియర్ ఇంజినీర్: 160
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్.
విద్యార్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్/సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
అకౌంట్స్ అసిస్టెంట్: 8
విద్యార్హతలు: బీకామ్ డిగ్రీ ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్: 6
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
స్టెనోగ్రాఫర్: 1
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు వేగం, టైప్‌రైటింగ్‌లో 40 పదాల వేగం ఉండాలి.
మెయింటెనర్: 311
విద్యార్హతలు: పదో తరగతి, ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: డిసెంబరు 15

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.