యాప్నగరం

ఆంధ్రప్రదేశ్ కంట్రీ, టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగాలు

డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్- గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా అప్రెంటీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TNN 4 May 2017, 8:36 pm
డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్- గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా అప్రెంటీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పట్టణాల్లోని డిప్లొమా అప్రెంటీసెస్ పోస్టులను భర్తీ చేస్తారు. వీరిని ఏడాది తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,500 స్టయిపెండ్ చెల్లిస్తారు.
Samayam Telugu diploma apprentices in town country planning department in ap
ఆంధ్రప్రదేశ్ కంట్రీ, టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగాలు

డిప్లొమా అప్రెంటీసెస్: 252
జోనల్ వారీగా ఖాళీలు: జోన్- 1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం)- 27, జోన్-2 (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్టా) 58, జోన్- 3 (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) 77, జోన్-4 (అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు 90.

విభాగాలు: సివిల్
విద్యార్హతలు: పదో తరగతి, సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ బోర్డు నుంచి అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి. 2015 తర్వాత డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

వయోపరిమితి: 2017 ఏప్రిల్1 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పదో తరగతి, డిప్లొమా మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. జోనల్ వారిగా నియామకం జరుగుతుంది. 30 శాతం లోకల్/ నాన్-లోకల్ కోటాలోనూ, మిగతా 70 శాతం లోకల్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: డీటీసీపీ ఏపీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 4
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: మే 18

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.