యాప్నగరం

పోస్టల్ ఉద్యోగాలు... పదోతరగతి అర్హత..!

కేవలం పదోతరగతి అర్హతతో... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశాన్ని భారతీయ తపాలశాఖ కల్పించింది. ఈ మేరకు తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్ ప‌రిధిలో పోస్ట్‌మ్యాన్‌, మెయిల్‌గార్డ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 22 Mar 2018, 5:58 pm
కేవలం పదోతరగతి అర్హతతో... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశాన్ని భారతీయ తపాలశాఖ కల్పించింది. ఈ మేరకు తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్ ప‌రిధిలో పోస్ట్‌మ్యాన్‌, మెయిల్‌గార్డ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.400 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
Samayam Telugu postal


అభ్యర్థి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల్లో దరఖాస్తు ప్రక్రియ చేయాలి. మొదటి దశలో అభ్యర్థి ప్రాథమిక వివరాలు మాత్రమే నమోదుచేయాలి. ఫీజు చెల్లించాకా.... మలిదశలో... ఫీజు వివరాలతోపాటు, ఇతర వివరాలనను నమోదు చేయాల్సి ఉంటుంది. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు...
పోస్ట్‌మ్యాన్‌, మెయిల్‌గార్డ్: 136 పోస్టులు
* పోస్ట్‌మ్యాన్‌: 132
* మెయిల్‌గార్డ్‌: 04

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌.
వయసు: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.04.2018
* పోస్టాఫీసులో ఫీజు చెల్లించడానికి చివరితేది: 25.04.2018
* మలి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 28.04.2018.
undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.