యాప్నగరం

ఈసీఐఎల్‌లో డిప్లొమా, ఐటీఐ వారికి ఉద్యోగాలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ అర్టిసన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 1 Jun 2017, 7:46 pm
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ అర్టిసన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బెంగళూరు కేంద్రంలోని సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ అర్టిసన్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
Samayam Telugu ecil jobs notification for scientific asst and jr artison
ఈసీఐఎల్‌లో డిప్లొమా, ఐటీఐ వారికి ఉద్యోగాలు


సైంటిఫిక్ అసిస్టెంట్: 12
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ మెకానికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు నుంచి అయిదేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ అర్టిసన్: 35
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ రేడియో అండ్ టెలివిజన్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌‌స్ట్రుమెంటేషన్/ ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు నుంచి అయిదేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2017 మే 31 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితా తయారుచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈసీఐఎల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి నేరుగా ECIL Branch Office, No.1/1, 2nd Floor, Jeeven Sampige, LIC Building, Sampige Road, Bengaluru– 56000 చిరునామాకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ తేది: జూన్ 25

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.