యాప్నగరం

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 25 Apr 2017, 7:26 pm
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా విశాఖపట్నం, న్యూఢిల్లీ, జబల్‌పూర్, ముంబై, బెంగళూరు, శ్రీరంగపట్నం, నాగ్‌పూర్, పుణే కేంద్రాలోన్ని టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
Samayam Telugu ecil technical officers jobs notification 2017
ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు


టెక్నికల్ ఆఫీసర్: 15
కేంద్రాల వారిగా పోస్టులు: న్యూఢిల్లీ 7, ముంబై 2, బెంగళూరు 1, శ్రీరంగపట్నం 1, విశాఖపట్నం 1, పుణే 1, నాగ్‌పూర్ 1, జబల్‌పూర్ 1.
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది నుంచి రెండేళ్ల అనుభవం ఉండాలి. ఐటీ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, మెయింటెనెన్స్ నెట్‌వర్కింగ్, టెస్టింగ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్‌ఎఫ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ కేబుల్, వైరింగ్ విభాగంలో అనుభవం ఉండాలి.

వయసు: 2017 ఏప్రిల్ 30 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి, ఇంటర్వ్యూ కేంద్రాలకు అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతోపాటు నేరుగా హాజరుకావాలి. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు విశాఖపట్నంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మిగతా కేంద్రాలకు కూడా వెళ్లొచ్చు.

ఇంటర్వ్యూ తేది: మే 10
ఇంటర్వ్యూ కేంద్రం: ECIL, 47-9-28, MukundSuvasa Apartments, 3rd Lane, Dwaraka Nagar,Visakhapatnam, Andhra Pradesh-530016.

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.