యాప్నగరం

విద్యార్థుల‌కు ఉచితంగా పాఠ్య‌పుస్తకాలు: కేరళ సీఎం

కేరళ వరదల్లో పాఠ్యపుస్తకాలు కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా కొత్త పాఠ్యపుస్తకాలు అందిస్తామని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.

Samayam Telugu 20 Aug 2018, 5:28 pm
కేరళ వరదల్లో పాఠ్యపుస్తకాలు కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా కొత్త పాఠ్యపుస్తకాలు అందిస్తామని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వరదల్లో ఎందరో విద్యార్థుల పాఠ్యపుస్తకాలు తడిసి, వరదనీటిలో కొట్టుకుపోయాయని సీఎం చెప్పారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించిన మత్స్యకారులను సీఎం అభినందించారు. మత్స్యకారులు చేసిన సేవలకు గుర్తింపుగా రోజుకు ఒక్కొక్కరికి మూడువేల రూపాయలతోపాటు వారికైన ఇంధన ఖర్చులను ఇస్తామని సీఎం విజయన్ వివరించారు.
Samayam Telugu books


కేరళలో పరిస్థితి భయానకంగా మారింది. ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించగా.. లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళ రాష్ట్రానికి దేశంలోని రాష్ట్రాలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి వెళ్లిన సహాయక బృందాలు సేవలందిస్తున్నాయి. ఇతర దేశాలు కూడా కేరళను ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.