యాప్నగరం

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఎంసెట్, నీట్ శిక్షణ!

తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జేఈఈ, నీట్ శిక్షణ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్, బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ సోమవారం (జులై 30) తెలిపారు.

Samayam Telugu 30 Jul 2018, 10:47 pm
తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జేఈఈ, నీట్ శిక్షణ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్, బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ సోమవారం (జులై 30) తెలిపారు. శిక్షణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను శిక్షణ కోసం ఎంపిక చేయనున్నట్లు అశోక్ తెలిపారు.
Samayam Telugu eamcet


ఎంపీపీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులను ఒక్కో గ్రూపు నుంచి 30 మందిని ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. ఎంపికైనవారికి ఎంసెట్, జేఈఈ, నీట్, ఎయిమ్స్, ఎంసెట్ అగ్రికల్చర్ లాంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శిక్షణ ఇస్తామని ఆయన ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.