యాప్నగరం

రైల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ...!

రైల్వేశాఖ... ఇటీవల గ్రూప్‌-డి, లోకోపైలెట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే రాతపరీక్షల కోసం... తెలంగాణలోని అన్ని... బీసీ స్టడీసర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు... బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

TNN 1 Apr 2018, 10:52 am
రైల్వేశాఖ... ఇటీవల గ్రూప్‌-డి, లోకోపైలెట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే రాతపరీక్షల కోసం... తెలంగాణలోని అన్ని... బీసీ స్టడీసర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు... బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన బీసీ అభ్యర్థులకు మాత్రమే ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 040-24071178 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
Samayam Telugu training


మొత్తం 90 వేల ఖాళీల భర్తీకి రైల్వే శాఖ విడుదలచేయగా... ఈ ఉద్యోగాలకు ఏకంగా 2.8 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 26,502 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు 50 లక్షల దరఖాస్తులు రాగా, మిగతా 62,907 పోస్టులకు 1.50 కోట్ల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 90 వేల ఉద్యోగాలలో 9,500 ఆర్పీఎఫ్ పోస్టులు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.