యాప్నగరం

APPSC Group 2 Prelims Exam 2024: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. పేపర్ కఠినంగా ఉండటంతో..

APPSC Group 2 Result 2024 : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు త్వరలో గుడ్‌న్యూస్‌ రానుంది. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 18 Mar 2024, 5:59 pm
APPSC Group 2 Prelims 2024 : ఏపీపీఎస్సీ ఇటీవల గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని అభ్యర్థులు ఫీలవుతున్న నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ (APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 1 : 50 (ఒక పోస్టుకు 50 మంది) నిష్పత్తిలో మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి పరీక్ష మెయిన్స్ (APPSC Group 2 Mains 2024) కు ఎంపిక చేయలని APPSC బోర్డు నిర్ణయించింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. పేపర్ కఠినంగా ఉండటంతో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25వ తేదీన మొత్తం 899 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం కూడా విధితమే.
Samayam Telugu APPSC Group 2
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ 2024


ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC) వెల్లడించింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 - 8 వారాల్లో ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్‌ను జూన్/జులైలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

APPSC Group -2 మెయిన్‌ ఇలా :

APPSC Group-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1లో సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు).. సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ.. సెక్షన్‌–2 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.