యాప్నగరం

హేవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఈసీ) నాన్- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 3 Apr 2017, 7:14 pm
హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఈసీ) నాన్- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, ఫౌండ్రీమెన్ ట్రేడ్ ఐటీఐ, మెకానికల్, సివిల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్ డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu heavy engineering corporation limited non executives notification
హేవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు


ఐటీఐ ట్రెయినీ: 65
విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషీనిస్ట్, ఫార్గర్/ ఫార్గర్ కమ్ హీట్ ట్రీటర్, ఫౌండ్రీమెన్, వెల్డర్, ఆర్సీసీ.
విద్యార్హతలు: పదో తరగతి, ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్/ మెషీనిస్ట్/ ఫార్గర్/ ఫార్గర్ కమ్ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమెన్/ వెల్డర్/ ఆర్సీసీ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.

డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ: 35
విభాగాలు: మెకానికల్ / టూల్ అండ్ డై మేకింగ్, సివిల్, మెటలర్జికల్/ ఫౌండ్రీ టెక్నాలజీ/ ఫార్గ్ టెక్నాలజీ, ఎలక్ట్రీషియన్
విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హతతోపాటు మెకానికల్ / టూల్ అండ్ డై మేకింగ్/ సివిల్/ మెటలర్జికల్/ ఫౌండ్రీ టెక్నాలజీ/ ఫార్గ్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
వయసు: 2017 మార్చి 1 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా.
పరీక్ష విధానం: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం మార్కులు 100. దీనిలో రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, టెక్నికల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు చదివిన సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు టెక్నికల్ విభాగంలో ఉంటాయి.

దరఖాస్తు విధానం: హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 5
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్ 26

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.