యాప్నగరం

ఐబీపీఎస్ - 3562 పీవో పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ‘సీడ‌బ్ల్యూఈ పీవో/ఎంటీ-VII’ (కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీస్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 14 Aug 2017, 4:02 pm
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ‘సీడ‌బ్ల్యూఈ పీవో/ఎంటీ-VII’ (కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీస్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 3562 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2017 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
Samayam Telugu ibps releases cwe notification for 3562 probationary officer posts
ఐబీపీఎస్ - 3562 పీవో పోస్టులు


ఎంపిక విధానంలో 3 ప్రక్రియలు ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమిన‌రీ, మెయిన్స్‌ రాతపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి చివరితేది సెప్టెంబర్ 5.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 16 - సెప్టెంబర్ 5
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: అక్టోబ‌రు 7, 8, 14, 15
మెయిన్ ఎగ్జామ్ తేది: నబంబర్ 26
ఇంట‌ర్వ్యూలు: 2018 జ‌న‌వ‌రి/ఫిబ్ర‌వ‌రిలో.
ఐబీపీఎస్ ‘సీడ‌బ్ల్యూఈ పీవో/ఎంటీ-VII’ నోటిఫికేషన్..

Institute of Banking Personnel Selection (IBPS) releases Common Written Examination for Probationary Officers/ Management Trainees (CWE PO/MT-VII) notification. Total 3562 Vacancies will be filled.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.