యాప్నగరం

IBPS RRB Officer Scale 1: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీవో ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు.

Samayam Telugu 16 Oct 2018, 6:26 am
ఐబీపీఎస్ పరిధిలోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్ష ఫలితాలు సోమవారం (అక్టోబరు 15) విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేది ఆధారంగా ఫలితాలను చూడవచ్చు. ఈ పోస్టుల భర్తీకోసం ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను సెప్టెంబరులో విడుదల చేసింది. మెయిన్ పరీక్షలను సెప్టెంబరు 30న, అక్టోబరు 7న నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలనే సోమవారం విడుదల చేసింది.
Samayam Telugu IBPS-RRB-notification

ఫలితాల కోసం క్లిక్ చేయండి...
CRP-RRBs-VII - Recruitment of Officers Scale I
CRP - RRBs - VII- Recruitment of Officers Scale II
CRP - RRBs – VII- Recruitment of Officers Scale III

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని పోస్టుల భర్తీకి జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఆఫీసర్ (స్కేల్- 1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1,551 పోస్టులు ఉన్నాయి. ఐటీ, మార్కెటింగ్ అగ్రికల్చర్, లా, చార్టెడ్ అకౌంటెంట్ విభాగాల్లోని స్పెషలిస్ట్ ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతోపాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.
గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఉద్యోగాలు..వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.