యాప్నగరం

బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా విడుదల

నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్)లో 2018-19 విద్యా సంవత్సరానికి ప్రవేశాల జాబితాను విడుదల చేశారు. మొత్తం 1500 సీట్లకు 24,441 దరఖాస్తులు వచ్చాయి.

Samayam Telugu 15 Jun 2018, 1:41 am
నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్)లో 2018-19 విద్యా సంవత్సరానికి ప్రవేశాల జాబితాను విడుదల చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల కోసం ఏప్రిల్ నెలలో దరఖాస్తులను ఆహ్వానించగా 1500 సీట్లకు 24,441 దరఖాస్తులు వచ్చాయి. పదో తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచి సీటు పొందిన 1,404 విద్యార్థుల జాబితాను గురువారం(జూన్ 14) విద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇన్‌ఛార్జి ఉపకులపతి డా.అశోక్ విడుదల చేశారు. ఎంపిక జాబితాలో బాలికలు 62 శాతం, బాలురు 38 శాతం సీట్లు సాధించారు. నిజామాబాద్ జిల్లా అత్యధికంగా 273 సీట్లు సాధించింది. ఏపీ నుంచి 55 మంది విద్యార్థులు సీట్లు పొందారు.
Samayam Telugu IIIB


ఎంపికైన విద్యార్థులకు జూన్ 21, 22, 28 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 21న 1 నుంచి 800 వరకు, 22న 801 నుంచి 1404 వరకు ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉపకులపతి తెలిపారు. మిగతా 96 సీట్లను ఎన్‌సీసీ, స్పోర్ట్స్, సైనిక విద్యార్థులు, దివ్యాంగులతో భర్తిచేస్తారు. వీరికి జూన్ 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు . ఎవరైనా విద్యాలయంలో చేరకపోతే వారి స్థానంలో తదుపరి జాబితాలోని విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. జులై 3 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.