యాప్నగరం

ఐఐఐటీ ఇడుపులపాయలో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఐఐఐటీ ఇడుపులపాయలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Samayam Telugu 14 May 2017, 7:17 pm
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఐఐఐటీ ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ)‌లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ విభాగాల్లోని అకడమిక్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
Samayam Telugu iiit rk valley academic assistants notification
ఐఐఐటీ ఇడుపులపాయలో ఉద్యోగాలు


అకడమిక్ అసిస్టెంట్
విభాగాలు: ఇంజినీరింగ్- కెమికల్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్; కెమిస్ట్రీ, ఇంగ్లిష్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథ్‌మెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, తెలుగు.

విద్యార్హతలు: కెమికల్/ సివిల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్/ పీహెచ్‌డీ/ బీటెక్/ కెమిస్ట్రీ/ ఇంగ్లిష్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ మేనేజ్‌మెంట్/ మ్యాథ్‌మెటిక్స్/ ఫిజికల్ ఎడ్యుకేషన్/ ఫిజిక్స్/ తెలుగులో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. నెట్/ స్లెట్/ పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: విద్యార్హత ధ్రువపత్రాలను తీసుకుని నేరుగా జూన్ 2, 3 తేదిల్లో జరిగే ఇంటర్వ్యూ కేంద్రానికి హాజరు కావాలి. Ground Floor, Academic Office, Academic Block-1, IIIT RK Valley Campus, Idupalpaya, kadapa, Andhra Pradesh కేంద్రానికి రావాలి.

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.