యాప్నగరం

GATE 2022 తాజా అప్‌డేట్‌.. రిజిస్ట్రేషన్‌ ప్రారంభం ఎప్పటి నుంచో తెలుసా..?

GOAPS: ఈ ఏడాది గేట్​ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది. గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (GOAPS) ద్వారా సెప్టెంబర్​ 24లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Samayam Telugu 30 Aug 2021, 10:16 pm
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE - 2022) ప్రక్రియ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 24 వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది గేట్ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది.
Samayam Telugu గేట్‌ 2022


గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (GOAPS) ద్వారా సెప్టెంబర్ 24లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే దేశంలో కోవిడ్ పరిస్థితిని బట్టి ఎగ్జామ్ తేదీని మార్చే అవకాశం ఉందని ఐఐటీ ఖరగ్పూర్ వెల్లడించింది.

విద్యార్హత:
ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్‌ విభాగాల్లో ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్, బీఆర్క్, బీ ప్లానింగ్ ఉత్తీర్ణత సాధించాలి. మూడు, నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులు. భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో యూజీ కోర్సులు చేస్తున్న.. పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

ఈ ఏడాది మార్పులివే:
గేట్– 2022లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది కొత్తగా నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమాటిక్స్ ఇంజినీరింగ్ రెండు పేపర్లను చేర్చారు. ఈ రెండు పేపర్లతో గేట్ సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. అభ్యర్థులు వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరయ్యే విధానాన్ని గేట్–2021 నుంచి అమలు చేస్తున్నారు.

గేట్ ఎగ్జామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో ఎంఈ/ఎంటెక్ అడ్మిషన్లు పొందవచ్చు. అంతేకాకుండా.. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.